వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక విచారణ కొనసాగుతుంది, ఈ హత్య కేసులో కడప సెంట్రల్ జైల్ లో మరో సారి కీలక వ్యక్తుల్ని సిబిఐ బృందం విచారణ చేయబోతుంది. కాగా మరి కొద్ది సేపట్లో సిబిఐ విచారణకు గాను వైఎస్ భారతి సహాయకుడు నవీన్ మరియు సిఎం వో ఎస్ డి కృష్ణ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే ఇద్దరికీ వాట్స్ యాప్ ద్వారా సిబిఐ అధికారులు నోటీసులు పంపించడం జరిగినది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు దర్యాప్తు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అయితే ముఖ్యంగా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పలుమార్లు ఫోన్ చేసినట్లుగా..ఆయన కాల్ డేటా ద్వారా సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
- Vande Bharat Express: సామాన్యులకు అందుబాటులో లేని వందే భారత్ కు ఎందుకంత ప్రచారం: పొన్నాల
- నాటు నాటు పాట వల్ల 6 రోజుల్లో 4 కిలోలు తగ్గిన చెర్రీ – డ్యాన్స్ వల్ల ఎవరైనా ఇట్టే బరువు తగ్గేస్తారు