Balakrishna – కసి తీరలేదు.. ఆ సినిమా చేస్తా.. ‘వీరసింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య
ఒంగోలులో నిన్న రాత్రి జరిగిన ‘వీరసింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో నందమూరి బాలకృష్ణ చాలా పవర్‌ఫుల్‌గా డైలాగ్‌లు చెప్పి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్‌కాబోతోంది. ఈ మూవీలో బాలయ్యకి జతగా శృతి హాసన్ నటించింది. అలాగే దునియా విజయ్, హనీ రోస్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, అజయ్ ఘోస్ నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ ఈవెంట్‌లో బాలయ్య కొన్ని సీరియస్ డైలాగ్‌లు చెప్పడంతో పాటు ఒంగోలియన్స్ , మంగోలియన్స్ అంటూ కాసేపు నవ్వులు పూయించారు.
ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ చెంఘీజ్ ఖాన్ సినిమా చేయాలనేది నా జీవిత ఆశయం. ఇద్దరు క్రాక్‌లు కలిస్తే ఎలా ఉంటుందో? గోపీచంద్ మలినేని, నేను కలిస్తే అలా ఉంటుంది. ఒంగోలు గిత్త ఈ గోపీచంద్ మలినేని. ఎన్ని సినిమాలు చేసినా.. నాకు ఇంకా కసి తీరలేదు. బాలయ్య ఇక రాడు.. రాజకీయాల్లోకి వెళ్ళాడు వాటికే పరిమితంలే అనుకున్నారు కానీ కొత్తగా ట్రై చేస్తున్నా. అదే దిశలో చేసిన ఆహా అన్‌స్టాబబుల్ ఇప్పుడు టాక్ షోలకే అమ్మ మొగుడై కూర్చుంది. కొత్తదనం ఇవ్వాలనే తాపత్రయంలో చేసిందే అన్‌స్టాబబుల్ షో. వీరసింహరెడ్డి లో ఫ్యాక్షన్ ఇప్పుడు ఎందుకు అంటున్నారు. దాని వెనుక ఒక బలమైన కథ ఉంది. శృతి హాసన్ హిరోయిన్ గా , దునియా విజయ్ విలన్‌గా చాలా బాగా నటించారు’ అని బాలయ్య చెప్పారు.
సప్తగిరి గురించి మాట్లాడిన బాలయ్య సప్తగిరికి ఉన్నంత కామెడీ టైమింగ్ నాకు లేదు. ఎన్ని సినిమాలు చేసినా అతని కామెడీ టైమింగ్ చూసి నేర్చుకోవాలని అనుకుంటున్నా. సప్తగిరి ని చూస్తే నాకు ఈర్ష’ అని చెప్పారు. లాస్ట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని మార్చడంపై బాలయ్య స్పందించారు. నిజనికి ముందు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ.. పోలీసుల సూచనల మేరకు మార్కెట్ యార్డ్‌కి ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్‌ప్రా గ్రౌండ్‌లో నిర్వహించారు. ‘ఆ వేదిక సరిపోదని.. చాలా మంది అభిమానులు వస్తున్నారని సమాచారం రావడంతో ఇక్కడికి వేదికని మార్చారు’ అని సున్నితంగా చెప్పుకొచ్చారు.