veerasimhareddy – బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్ రిలీజ్..
veerasimhareddy – నందమూరి బాలయ్య నటిస్తున్న వీరసింహరెడ్డి ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఒంగోలు ప్రీ రిలీస్ వేడుకగా ఈ ట్రైలర్ రిలీస్ చేశారు .
క్రాక్ డైరెక్టర్ గోపి చంద్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. డ్యుయల్ రోల్ లో బాలయ్య కనిపించనున్నారు..
ఈ సినిమా డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేలా సాయి మాధవ్ బుర్రా రాసారు.
శృతి హాసన్ బల్లయ్య కి జోడీగా నటించగా.. తమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.
‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో.. పెత్తనం కోసమే కాదు. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్. వీరసింహా రెడ్డి..
పుట్టింది పుల్లిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్’ అంటూ బాలయ్య మాస్ డైలాగ్స్ లో ఆడియన్స్ ని ఆకటుకున్నారు.
ఈ డైలాగ్స్ చూస్తుంటే ఈ సినిమా పూర్తి రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.
బాలయ్య తో శృతి హాసన్ వేసిన స్టెప్స్ అందర్నీ ఆకర్శించేలా వున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ఈ సినిమాలో కీ రోల్ పోషించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై కూడా ఈ సినిమాలో ఓ డైలాగ్ పెట్టినట్లు కనిపిస్తుంది.
‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో? కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.
మార్చలేరు’ అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పారు. లాస్ట్ గా
‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ’ అంటూ బాలయ్య విలన్‌కి వార్నింగ్ ఇస్తూ కనిపించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుంది.
How’s #VeeraSimhaReddy trailer? pic.twitter.com/sLh2ohw44t
— Aakashavaani (@TheAakashavaani) January 6, 2023