Veera Simha Reddy రన్‌టైమ్‌పై సందిగ్ధత.. 47 నిమిషాలు కట్?
Veera Simha Reddy – నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా శృతి హాసన్ నటించింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో.. పుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ అలరించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్తోంది.
సంక్రాంతికి వీరసింహా రెడ్డి మూవీతో మరో నాలుగు సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్‌కాబోతోంది. అలానే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. మరోవైపు తమిళ్ హీరోలు దళపతి విజయ్ నటించిన వారీసు మూవీ తెలుగులో వారసుడు పేరుతో ఇదే సంక్రాంతికి.. అది కూడా జనవరి 12న రిలీజ్ అవుతోంది. మరో హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ కూడా సంక్రాంతి రేసులో ఉంది. దాంతో పోటీ చాలా ఆసక్తిగా ఉండనుంది.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఇప్పటికే సెన్సార్ పనుల్ని కూడా పూర్తి చేసుకోగా.. ఆ మూవీకి యు/ఏ సర్టిపికెట్‌ని ఇచ్చారు. అలానే ఈ మూవీ రన్‌టైమ్ కూడా 160 నిమిషాలు. అంటే.. 2 గంటల 40 నిమిషాలు. ఈ నిడివి చాలా ఎక్కువ అని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. కానీ.. వీరసింహా రెడ్డి రన్‌టైమ్ ఏకంగా 197 నిమిషాలు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల రిలీజైన అవతార్ -2 మూవీ రన్‌టైమ్ 192 నిమిషాలుకాగా.. ఈ నిడివిపై చాలా మంది థియేటర్ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో వీరసింహా రెడ్డి టీమ్ కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
వీరసింహా రెడ్డి సినిమాని ఆఖరిగా రెండు గంటల 30 నిమిషాలకి కుదించాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందట. ఈ మేరకు కత్తెరకి పని చెప్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులో ఈ నెల 6న (శుక్రవారం) నిర్వహించబోతున్నారు. తొలుత ఎబీఎం కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ నిర్వహణకి ప్లాన్ చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో నేపథ్యంలో వేదికని త్రోవ గుంట సమీపంలోని అర్జున్ ఇన్‌ఫ్రాలోకి మార్చారు.