పలనాడు ఘటనపై ట్వీట్ చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు:

Spread the love

మాచర్ల ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరు డీఐజీకి ఫోన్ చేశారు. పరిస్థితి దారుణంగా ఉంటే పోలీసులు స్పందించడం లేదని వాపోయారు. అధికార పార్టీ దుందుడుకు ప్రవర్తనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోతున్నాయో దీన్ని బట్టి అర్థమవుతోందని ట్వీట్ చేశారు. కాగా, మాచర్ల ఘటనను ఖండిస్తూ టీడీపీ అధినేత నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మాచర్లలో వైసీపీ నేతలను పోలీసులు కొమ్ముకాస్తున్నారని సమాచారం. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహాయంతో టీడీపీ శ్రేణులపై దాడి చేయడం దారుణం. మన రాష్ట్రం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలపై వైసీపీ రౌడీలు దాడులు చేయడం రాష్ట్రంలో అరాచకానికి నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి పోలీసులు టీడీపీ కార్యకర్తల పై లాఠీచార్జి చేయడం దారుణమని లోకేష్ అన్నారు.

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో జరిగిన ఘర్షణలపై రాజకీయ దుమారం చెలరేగింది. టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూవుంటాయి. కార్లు, కార్యాలయాలను తగలబెట్టే స్థాయికి వెళ్లింది. ఇరువర్గాలు ఒకరినొకరు కొట్టుకునేందుకు రాళ్లు, కర్రలు ఉపయోగించుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నేత బ్రహ్మారెడ్డికి చెందిన కార్లు, భవనానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మారెడ్డి ఇంటిపై ఎవరో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడం తో బ్రహ్మారెడ్డి ని మాచర్ల నుంచి పంపించి వేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *