సీతాదేవి ,లంకానగరంలో జన్మించిందా? రావణుడే ,సీతను బంగారుపెట్టేలో పెట్టి సముద్రం లో విడిచిపెడతాడా?

Spread the love

సీతాదేవి పూర్వ జన్మలో వేదవతి . ఈమె తండ్రి ‘కుశధ్వజుడు , తల్లి -మాలావతి . సీతా దేవి పుట్టినప్పుడు వేద ఘోష వినిపించడం వల్ల ” వేదవతి” అని పేరు పెట్టారు..తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు. వేదవతి కుడా నిరంతరం విష్ణు మూర్తిని ధ్యానిస్తూ ఉండేది . అయితే ఓ రాక్షసుడు ఈమెను మోహిస్తాడు . వేదవతిని ఇవ్వడానికి కుశధ్వజుడు ఒప్పుకోడు . అప్పుడా రాక్షసుడు కుశధ్వజుడుని చంపేస్తాడు …మాలావతి కుడా భర్త మరణంతో తను మరణిస్తుంది . తల్లి దండ్రులను పోగొట్టుకున్న వేదవతి అడవికి వెళ్లి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది . లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి వెళ్లి చేసుకోమని కోరుతాడు . అప్పుడు వేదవతి … తానూ విష్ణుమూర్తిని తప్ప ఎవరినీ వివాహము చేసుకోనని చెప్తుంది . అయినా కామము తో రవాణుడు వేదవతి పై చేయివేస్తాడు .. పరపురుషుడు తాకినా శరీరంతోతో జీవించడం ఇష్టంలేని వేదవతి యోగాగ్నిని సృష్టించుకొని అందులో దగ్దమైపోతుంది . రావణుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూనుతుంది . కొంతకాలానికి లంకా నగరంలో ఒక కమలంలో ఈమె జన్మిస్తుంది . ముందుగా రావణుడే చూస్తాడు … ఈమె జన్మ అతనికి అరిష్టమని జ్యోతిష్కులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారుపెట్టేలో పెట్టి సముద్రంలో వదిలిపెడతాడు . ఆపెట్టే కొంతకాలానికి మిధిలా నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగాటి చాలులో జనకమహరాజుకు దొరుకుతుంది .
౼౼౼మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేస్తూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె తగులుతుంది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు, సీత అని నామకరణము చేసి జనకమహారాజు, సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు కానీ గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్ పూర్ అప్పటి మిథిలా నగరమని చెబుతారు…
౼౼౼రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని విజయవంతంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు..అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపిస్తాడు. వేరే ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు..తన కుమార్తె ‘వీర్యశుల్క’ అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితోపాటే లక్ష్మణునకు ఊర్మిళతోను , భరతునకు మాండవితోను , శత్రుఘ్నునకు శృతకీర్తితోను వివాహం నిశ్చయమైనది… జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొచ్చిన “కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత…ఈమె నీకు సహధర్మచారిణి….ఈమేనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది” అని చెప్పాడు. సీతారాముల, వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *