Pani Puri Side Effects: మీరు వీటిని తింటున్నారా..? అయితే ఇది మీ కోసమే..

Pani Puri Side Effects:
Spread the love

చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేవాటిల్లో పానీ పూరీ  తప్పక ఉంటుంది. రోడ్ల పక్కన కనిపించే ప్రతిదీ తినకూడదు.. తింటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలుసు. కానీ ఎందుకో అందరం వెళ్లి వాటినే తినడానికి ఇష్టపడతాం. కానీ  పానీ పూరీ ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం సీజన్‌లో వీటిని తింటే టైఫాయిడ్, ఇంకా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుందిన వైద్య నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యంపై ప్రభావాలు:

వర్షాకాలంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యాధులలో టైఫాయిడ్ చాలా ముఖ్యమైనదనే చెప్పుకోవాలి. తెలంగాణలో టైఫాయిడ్ రోగుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీని దీనికి బాధ్యతగా పరిగణించింది.

మే నెలలో తెలంగాణలో సుమారు 27,00 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, జూన్ నెలలో 2752 కేసులు నమోదయ్యాయి. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ టైఫాయిడ్‌కు ‘‘పానీ పూరీ డిసీజ్’’ అని పేరు పెట్టారు. పానీ పూరీ వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని  అనేక మంది వైద్యులు పేర్కొన్నారు.

పానీ పూరీ సైడ్ ఎఫెక్ట్స్

పానీ పూరీ వల్ల టైఫాయిడ్ మాత్రమే కాదు, శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే చాలా మంది పిల్లలలో గొల్గప్ప తినడం నిషేధం. దీని కారణంగా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం-

  • పానీ పూరీ అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది.
  • మీ పిల్లలు ఎక్కువ పానీ పూరీను తీసుకుంటే అది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.
  • పానీ పూరీ ఎక్కువగా తింటే వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశం ఉంది.
  • పానీ పూరీ వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
  • పానీ పూరీని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి.
  • పానీ పూరీ ప్రేగులలో మంటకు కూడా కారణం కావచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *