NTR సినిమా విషయంలో… ప్రశాంత్ నీల్ కీలక నిర్ణయం… !

ntr
Spread the love

NTR సినిమా విషయంలో… ప్రశాంత్ నీల్ కీలక నిర్ణయం… !

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే చాలా రోజుల నుంచి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ వార్త ఒక్కటి చక్కర్లు కొడుతుంది.యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.కేజీఎఫ్ 2 కు ముందు వరకు ఈ సినిమాపై ఓ అంచనాలు ఉన్నాయి. కాని కేజీఎఫ్ 2 విడుదల అయ్యి వెయ్యి కోట్లకు పైగా నే వసూళ్లు చేసిన తర్వాత ఎన్టీఆర్‌ 31 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.NTR 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా టీం పోస్టర్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ ఊర మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్ విడుదల అయ్యింది. దీంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు.

NTR తో భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా పై తారక్ ఫాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ తల్లి షాలిని గారు కర్నాటకకు చెందిన వారు. పైగా ఎన్టీఆర్‌కు కన్నడ భాష బాగా తెలుసు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించి కన్నడ భాషలో డబ్బింగ్ చేయడం కంటే.. డైరెక్ట్ కన్నడ చిత్రంగానే ఈ చిత్రాన్ని నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ 31 సినిమా విషయానికి వస్తే…

ఈ సినిమా ఓ పీరియాడిక్ డ్రామా అని, ఈ సినిమాలో హీరో – విలన్ రెండూ ఎన్టీఆరే అని.. అనగా ఈ సినిమాలో NTR ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్, NTR కోసం అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

NTR 31 ను ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ పై ప్రశాంత్‌ నీల్‌ ఫోటో షూట్‌ టెస్ట్‌ షూట్‌ నిర్వహించాడు. ఈ పోస్టర్ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా 32 కెమెరాలు ఉపయోగించాడని సమాచారం. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సలార సినిమాలో బిజీగా ఉన్నాడు.ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సాలార్‌ మూవీతో బీజీగా ప్రశాంత్‌ నీల్‌… వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ మూవీ చేయనున్నారు.

ఈ సినిమాకు మంచి పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టె ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. ఆ టైటిల్ కూడా ‘అసుర’ లేక ‘అసురుడు’ అని వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.
ఇప్పటికే ఎన్టీఆర్ 31 చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ వేటలో కూడా ఉన్నారు ప్రశాంత్ నీల్, పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వీరసింహారెడ్డిలో మేజర్ సీన్స్ లీక్:

హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ వెళ్లే టాలీవుడ్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆరు పదుల వయసులోనూ అస్సలు వెనక్కి తగ్గని ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన ‘అఖండ’ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అప్పటి నుంచి మరింత జోష్‌తో బాలయ్య ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఆయన ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

అఖండ’ వంటి భారీ హిట్ తర్వాత నటసింహా బాలకృష్ణ రెట్టించిన జోష్‌తో కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇందులో ‘క్రాక్’ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ అనే ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం అనంతపురం ఏరియాలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన అంశం లీక్ అయింది.సాధారణంగా బాలకృష్ణ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉంటాయి.

అందుకు అనుగుణంగానే ‘వీరసింహారెడ్డి’ మూవీలో కూడా ఈ విభాగమే హైలైట్ కాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్లు ఉంటాయని, వీటిని స్టన్ శివ నేత‌ృత్వంలోని టీమ్ డిజైన్ చేసిందని తెలిసింది. ఈ సినిమాలోని ఫైట్ సీన్లే దాదాపు గంట వరకూ ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయిపోయాయి.నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.

వాల్తేరు వీర‌య్య‌ను మించిన వీర‌సింహారెడ్డి…

వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ట న‌టిస్తోన్న వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. అఖండ త‌ర్వాత బాల‌య్య చేస్తోన్న సినిమా వీర‌సింహారెడ్డి. ఇటు ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్ త‌ర్వాత చిరు న‌టిస్తోన్న సినిమా వాల్తేరు వీర‌య్య‌. రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్ బ్యాన‌ర్లోనే తెర‌కెక్కుతున్నాయి.దీంతో నిర్మాత‌లు చాలా చోట్ల రెండు సినిమాల పంపిణీ రైట్స్ క‌లిపి అమ్ముతున్నారు. చాలా ఏరియాల్లో ఇప్ప‌టికే ఈ ప‌ద్ధ‌తిలో బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. నైజాంలో ఈ రెండు సినిమాల రైట్స్ రు. 35 కోట్ల‌కు విలువ క‌ట్టారు.

ఇక్క‌డ ఈ రెండు సినిమాలు వీరే సొంతంగా పంపిణీ చేసుకుంటున్నారు. ఇక సీడెడ్‌కు వ‌చ్చే స‌రికి రెండు సినిమాల‌కు రు. 24 కోట్లు కోడ్ చేశారు.అయితే ఇక్క‌డే డిస్ట్రిబ్యూట‌ర్లు తిర‌కాసు పెడుతున్నారు. సీడెడ్ వ‌ర‌కు బాల‌య్య సినిమా విడిగా ఇవ్వాల‌ని… అలా అయితేనే తాము మంచి రేటు ఇచ్చి తీసుకుంటామ‌ని ఖ‌రాఖండీగా చెపుతున్నారు. అంతేకాని చిరు సినిమా కూడా బాల‌య్య సినిమాకు లింక్ చేసి చెపితే తాము కొన‌మ‌ని చెప్పేస్తున్నార‌ట‌. సీడెడ్‌లో ఆచార్య‌కు రు. 4 కోట్లు కూడా రాలేదు. ఇక గాడ్‌ఫాద‌ర్ సినిమా సూప‌ర్ హిట్ అన్నారు. అయితే రు. 8 కోట్లు కూడా వ‌సూలు కాలేదు. అందుకే ఇప్పుడు వాల్తేరు వీర‌య్య‌కు రు. 8 కోట్లు కూడా పెట్టేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు.

అదే బాల‌య్య వీర‌సింహారెడ్డి వ‌ర‌కే చూస్తే ఏకంగా రు. 15 కోట్ల‌కు త‌గ్గ‌కుండా పెట్టేందుకు రెడీగా ఉన్నారు. అవ‌స‌రం అయితే మ‌రో కోటి కూడా బాల‌య్య సినిమాకు పెట్టేందుకు ఒక‌రిద్ద‌రు డిస్ట్రిబ్యూట‌ర్లు రెడీగా ఉన్నారు. అంతే కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ముడిపెట్టి ఇస్తామంటే మాత్రం తీసుకోవ‌డానికి ఒప్పుకోవ‌డం లేదు. ఓవ‌రాల్‌గా చూస్తే సీడెడ్‌లో ఎప్ప‌ట‌కీ బాల‌య్యే కింగ్ అన్న‌ది ట్రేడ్ వ‌ర్గాలే స్ప‌ష్టం చేస్తున్నాయి.

రష్మిక తోక కత్తిరించిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్ మీద ఉంది . మయోసైటిస్ అనే జబ్బు కారణంగా బాధపడుతున్న సరే తాను ఫస్ట్ టైం నటించిన పాన్ ఇండియా సినిమా యశోద సూపర్ సక్సెస్ అవడంతో ఫుల్ చిల్ అవుతుంది . అంతేకాదు తన ఆరోగ్యం ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మరింతగా మెరుగుపడిందని.. ఇలాగే కంటిన్యూ అయితే మరి రెండు నెలల్లోనే తన నెక్స్ట్ సినిమా ఖుషి షూటింగ్ కూడా పూర్తి చేసే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది.

కాగా ఇప్పటికే సమంత బాలీవుడ్ లో మూడు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . తెలుగులో ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది . ఖుషీ కూడా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

రాహుల్ సమంత నెక్స్ట్ సినిమాకు డైరెక్షన్ వహించబోతున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసింది రాహుల్ రవీంద్రన్ తో సమంత తన ఫస్ట్ సినిమాను చేసింది . మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో జంటగా నటించింది . అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. కాగా ప్రెసెంట్ రాహుల్ ఓ ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని.. ఆ సినిమా కోసం ఓ కత్తి లాంటి హీరోయిన్ ని వెతుకుతున్నాడని తెలుస్తుంది .
కాగా ఈ కథను రాహుల్ ముందుగా రష్మిక కు చెప్పారట. రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసిందని.. సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా కొన్ని కండిషన్స్ పెట్టిందట.

దీంతో ఆ కండిషన్స్ కి ఒప్పుకొని రాహుల్ ఈ కథను సమంతకు వివరించగా..ఆ కథవిన్న సమంత చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిందట . అంతేకాదు స్పాట్ లోనే అగ్రీమెంట్ పేపర్లు తెప్పించి సైన్ చేసిందట.ఏది ఏమైనా సరే రష్మిక నో చెప్పిన కధకి సమంత ఓకే చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే రష్మిక స్పీడ్ కు సమంత బ్రేక్ వేసిన్నట్లే అని చెప్పాలి . అంతేకాదు కృతి రిజెక్ట్ చేసిన మరో సినిమాకు సమంత సైన్ చేసే ఆలోచనలో ఉందట . ఈ కన్నడ బ్యూటీలకు భారీ ఘలక్ ఇవ్వబోతుంది సమంత అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *