Cloud Computing ఉద్యోగం చేస్తూనే..

Spread the love

Cloud Computing ఉద్యోగం చేస్తూనే.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోర్సు చేసే ఛాన్స్‌…

Clould Computing వృత్తి నిపుణులు ఉద్యోగానికి రిజైన్‌ చేయకుండానే పీజీ కోర్సు చేసే అవకాశాన్ని బిట్స్‌ కల్పిస్తోంది. బిట్స్‌- పిలానీలోని వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ (WILP) విభాగం ఆధ్వర్యంలో రెండేళ్ల ఎంటెక్‌ (MTech) క్లౌడ్‌ కంప్యూటింగ్‌ (Cloud Computing) కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఈ కోర్సును రూపొందించామని.. ఉద్యోగులు దీనివల్ల మరిన్ని నైపుణ్యాలు సాధించే అవకాశముంటుందని డబ్ల్యూఐఎల్‌పీ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ విభాగాధిపతి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు డిసెంబరు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Cloud Computing – కోర్సు ప్రత్యేకతలు చూస్తే …

ఎంటెక్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ తో పాటుగా కార్పోరేట్‌ కంపెనీల ఉద్యోగులు నిత్యం మారుతున్న డిజిటలీకరణలో మార్పులకనుగుణంగా తమను తాము ఆధునీకరించుకునేందుకు తోడ్పడేలా ఈ కోర్సును రూపొందించింది. ఇది నాలుగు సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌. ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం డిజైన్‌ చేశారు.

అందువల్ల వీరు పరిశ్రమ సంబంధిత బోధనాంశాలను క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో పొందవచ్చు.ఈ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ ద్వారా బిగ్‌ డేటా, డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌, నెట్‌వర్క్‌ మరియు క్లౌడ్‌లో సెక్యూరిటీ, క్లౌడ్‌ నేటివ్‌ అప్లికేషన్స్‌నిర్మాణం, క్లౌడ్‌ ఎకనమిక్స్‌ తో పాటుగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఇతర అంశాలు నేర్చుకోవచ్చు.

click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *