Buchi Babu ఛాన్స్ ఇచ్చినా నమ్మకాన్ని నిలబెట్టుకోలేదా?

Spread the love

Buchi Babu ఛాన్స్ ఇచ్చినా నమ్మకాన్ని నిలబెట్టుకోలేదా?

ఉప్పెన సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో బుచ్చిబాబు పేరు మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందనే వార్తలు ఫ్యాన్స్ కు సైతం ఆసక్తి కలిగించాయి. అయితే బుచ్చిబాబు చెప్పిన కథలో ఫస్టాఫ్ తారక్ కు నచ్చినా సెకండాఫ్ మాత్రం ఆశించిన విధంగా లేకపోవడంతో తారక్ ఈ ప్రాజెక్ట్ ను వదులుకున్నారని బోగట్టా.ఈ సినిమా సెకండాఫ్ లో సుకుమార్ పలు కీలక మార్పులు చేయగా ఆ మార్పులు సైతం తారక్ కు పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వలేదని సమాచారం అందుతోంది.

ఈ రీజన్ వల్లే తారక్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ పై ఆసక్తి కనబరచలేదని బోగట్టా. బుచ్చిబాబు తారక్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడని ఈ కారణం వల్లే ఛాన్స్ కోల్పోయాడని కూడా కామెంట్లు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.తారక్ బుచ్చిబాబు కాంబినేషన్ లో భవిష్యత్తులో కూడా సినిమా తెరకెక్కడం కష్టమేనని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కాల్సిన తారక్ బుచ్చిబాబు కాంబో మూవీ అధికారిక ప్రకటన రాకుండానే ఆగిపోయింది. తారక్ సుకుమార్ కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో సినిమా తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ కాంబినేషన్ లో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుకుమార్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా తారక్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. సుకుమార్ రెమ్యునరేషన్ భారీగా పెరగగా ఒక్కో సినిమాకు ఈ డైరెక్టర్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారం. తారక్ ప్రస్తుతం 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. తారక్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని బోగట్టా.

ఆ దమ్ము ఎవ్వడికైన ఉందా రా..?

నందమూరి నట సిం హం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజు విన్నా కానీ ఇంకా వినాలనిపిస్తుంది. చెప్పే వాళ్ళకి ఇంకా ఏదో మిగిలే ఉంది అన్న డౌట్లు వస్తాయి . అలాంటి ఓ చెరగని స్థాయిని సంపాదించుకున్నాడు నందమూరి బాలకృష్ణ . స్తండ్రి పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ.. ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు .ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హీరోలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. అందులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు నందమూరి బాలయ్య .

ఈ విషయం అందరి హీరోలకి హీరోయిన్ లకి తెలిసిన మాటే . కాగా ఎవరు ఊహించిన విధంగా హోస్ట్ గా మారిన బాలయ్య అన్ స్టాపబుల్ షో తో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటున్నారు . బాలయ్య ఓ రేంజ్ లో యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. షో కి వచ్చిన గెస్ట్ లని సరదాగా నవ్విస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు .ఈ క్రమంలోనే మూడో ఎపిసోడ్ కి గెస్ట్లుగా వచ్చిన యంగ్ హీరో శర్వానంద్, అడవి శేష్ ను ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే శర్వానంద్..” మీరు ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు కదా..

మరి మీపై ఎలాంటి రూమర్ రాలేదే..ఎందుకని” అంటూ ప్రశ్నించాడు . దీంతో బాలయ్య..” నాపై గాసిప్ రాసే దమ్ము ఎవరికైనా ఉందా..?” అంటూ తనదైన స్టైల్ లో రాయల్ ఆన్సర్ ఇచ్చాడు. దీనికి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు నిజానికి సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ అనేటివి చాలా కామన్ అయితే బాలయ్య కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పై ఏ గాసిప్ లు రాలేదు. ఏ హీరోయిన్ తో ఎఫైర్ అంటూ నిందలు పడలేదు. అలాంటి ఓ అన్ మార్కబుల్ రికార్డును సొంతం చేసుకున్నాడు బాలయ్య.

మహేష్ బాబు గొప్ప మనసు గురించి వివరించిన ‘జిన్నా’ దర్శకుడు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా చాలా మంది గుండెల్లో హీరోగా నిలిచాడు. ఇప్పటికే ఆయన 1000 మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. మరోపక్క తాను దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లోని ప్రజలకు విద్యా, వైద్యం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాడు. తన టీంతో..

నమ్రత హయాంలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది టెక్నీషియన్లకు, చిన్న చిన్న ఆర్టిస్ట్ లకు మహేష్ సాయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.ఇటీవల విష్ణుతో ‘జిన్నా’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఈషాన్ సూర్య.. తనకు మహేష్ చేసిన సాయం గురించి వివరించాడు. ఇతను శ్రీను వైట్ల దగ్గర చాలా సినిమాలకు రైటర్ గా పనిచేశాడు. ఆ టైంలో మహేష్ తో ఇతనికి పరిచయం ఏర్పడింది.

ఇతను దర్శకుడిగా మారడానికి ప్రయత్నిస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో తన పిల్లల చదువు కోసం చాలా ఇబ్బందులు పెట్టాడట. ఒకసారి వాళ్ళ చదువు ఆగిపోయే పరిస్థితి వస్తే..వేరే ఆప్షన్ లేక మహేష్ బాబు వద్దకు వెళ్ళాడట. అప్పుడు ఇతను సాయం అడగడానికి సంకోచిస్తుంటే .. మహేష్ చొరవ చేసుకుని అడిగాడట. విషయం తెలిసాక ‘ఈ మాత్రం దానికి ఇంత ఇబ్బంది పడతావ్ ఏంటి?’ అని చెప్పి మేనేజర్ ను పిలిచి ‘ఏం కావాలో చూసుకోండి’ అని చెప్పాడట. ఆరోజు మహేష్ బాబు అండగా నిలబడకపోతే తన పిల్లల చదువు ఆగిపోయేది అంటూ దర్శకుడు ఈషాన్ సూర్య చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

చిరంజీవి ,వెంకీ కుడుముల సినిమా ఆగిపోయినట్టేనా?

2015 కి ముందు వరకు అగ్ర నిర్మాణ సంస్థలు అంటే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్'(దిల్ రాజు), ‘గీతా ఆర్ట్స్'(అల్లు అరవింద్), ‘సురేష్ ప్రొడక్షన్స్'(సురేష్ బాబు) బ్యానర్ల పేర్లే వినిపించేవి. అయితే ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ తో ఒక్కసారిగా రాకెట్ లా దూసుకొచ్చింది ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోలందరూ ‘మైత్రి’ వారితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అలాగే అగ్ర హీరోలు,ద‌ర్శ‌కులు, హీరోయిన్లంద‌రికీ ‘మైత్రీ’ వారు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేస్తున్నారు.

చిరు, బాలయ్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో పాటు విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి మిడ్ రేంజ్ హీరోలు ఇలా అందరూ ‘మైత్రి’ లోనే సినిమాలు చేస్తున్నారు. ఆఖరికి విజయ్, సల్మాన్ ఖాన్ వంటి పక్క భాషల్లోని స్టార్ హీరోలను కూడా లాక్ చేసేసింది మైత్రి. ఇప్పుడు మరో మిడ్ రేంజ్ హీరో నితిన్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తుంది.మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి వెంకీ కుడుముల దర్శకుడు. గతంలో నితిన్ తో ఇతను ‘భీష్మ’ అనే మూవీ సూపర్ హిట్ మూవీ తీశాడు.

తర్వాత చిరంజీవితో మూవీ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘విక్రమ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు కూడా చిరంజీవితో సినిమా చేస్తున్నట్టు ధీమాగా చెప్పుకొచ్చాడు వెంకీ కుడుముల. కానీ చిరుతో మూవీ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. మరోపక్క చిరు కూడా ‘భోళా శంకర్’ ‘ వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. కాబట్టి.. అప్పటి వరకు వెంకీ ఖాళీగా ఉండలేడు కాబట్టి నితిన్ తో మరో సినిమా సెట్ చేసుకున్నాడు వెంకీ. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *