BJP జూ ఎన్టీఆర్ కు బీజేపీ రెడ్ కార్పెట్…అంతా అమిత్ షా డైరెక్షన్.

Spread the love

BJP జూ ఎన్టీఆర్ కు బీజేపీ రెడ్ కార్పెట్…అంతా అమిత్ షా డైరెక్షన్.

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. టీడీపీ – జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలే రిపీట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వద్దకు నాడు వెళ్లిన విధంగానే, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మరోసారి వెళ్లారు. దీంతో..ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని వైసీపీ ప్రచారం చేస్తోంది.

 

కానీ, బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేదీ లేనిదీ క్లారిటీ ఇవ్వటం లేదు.పవన్ – చంద్రబాబు పొత్తు వేళ 2014 తరహాలోనే మూడు పార్టీలు కలిసి ఉండాలని చంద్రబాబు – పవన్ కోరుకుంటున్నారు. ఇందు కోసం చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణితో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ అనూహ్యంగా జూ ఎన్టీఆర్ పైన ఫోకస్ పెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమిత్ షా హైదరాబాద్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తో నిర్వహించిన సమావేశం రాజకీయంగా పెద్ద చర్చకు కారణమైంది. దీని పైన ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు.

బీజేపీ నేతలు మాత్రం ఇది రాజకీయ సమావేశమనే చెబుతున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రభుత్వం గత ఏడాది హఠాన్మరణం చెందిన పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న పురస్కారం ప్రధానం చేసింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇందు కోసం బెంగుళురుకు చేరుకున్న సమయం నుంచి జూనియర్ కు అక్కడి ప్రభుత్వం స్వాగతం నుంచి మర్యాదల వరకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఒక విధంగా ఎన్టీఆర్ కు రెడ్ కార్పెట్ పరచటం ఇప్పుడు మరోసారి చర్చకు కారణమవుతోంది.

బీజేపీ ముఖ్యనేతల సూచనల మేరకే అటు రజనీ..ఇటు జూ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. జూ ఎన్టీఆర్ కు పునీత్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ బంధం కారణంగానే జూనియర్ ను ఆహ్వానించారనే వాదన ఉంది. ఇక, ఈ కార్యక్రమంలో తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.కన్నడలో మాట్లాడుతూ తారక్ అభిమానుల్లో జోష్ పెంచారు. తాజాగా ఎన్టీఆర్ పేరు మార్పు వివాదంలో తారక్ స్పందించిన తీరు పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఇక, అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ చేస్తే కొందరు చేసిన వ్యాఖ్యలు తారక్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఇక..పవన్ కళ్యాణ్ తో టీడీపీ జత కడుతున్న వేళ.. ఇటు బీజేపీ ముఖ్య నాయకత్వం తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల్లోనూ అభిమన గణం ఉన్న జూనియర్ కు ఇస్తున్న ప్రాధాన్యత..రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.

click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *