Junior NTR ఎన్టీఆర్‌ సినిమా కోసం భారీ స్కెచ్‌ వేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.

Spread the love

Junior NTR ఎన్టీఆర్‌ సినిమా కోసం భారీ స్కెచ్‌ వేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.. రంగంలోకి మరో హీరో.

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. కేవలం సౌత్‌కే పరిమితమైన కన్నడ సినిమా ఇండస్ట్రీ పవర్‌ను బాలీవుడ్‌కు రుచి చూపించాడు. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా ఇండియాన్‌ బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని నమోదు చేసుకొని, రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దీంతో ప్రశాంత్‌ తర్వాతి చిత్రాలపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా సలార్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదలవ్వకముందే ప్రశాంత్‌ నీల్‌ టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఓ భారీ యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాను తెరకెక్కిస్తుండడమే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోన్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో నటించున్నాడని తెలుస్తోంది. సినిమాలో హృరో పాత్రతో పాటు హైలెట్‌గా నిలిచే మరో పాత్ర కోసం ప్రశాంత్‌ నీల్‌ తమిళ హీరో విక్రమ్‌ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విక్రమ్‌ కూడా ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన ఒక్కే బ్యాలెన్స్‌ ఉందని ఇండస్ట్రీ టాక్‌. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.

బాలయ్య, బోయపాటి కాంబో ఫిక్స్ – ఈసారి పొలిటికల్ డ్రామాతో!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. గతేడాది ‘అఖండ’ సినిమాతో రికార్డులు సృష్టించిన వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి పొలిటికల్ డ్రామా కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. 2024 ఎన్నికల కంటే ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. బోయపాటి మాత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. 2023లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. పవర్ ఫుల్ మాస్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను 2024 సమ్మర్ కి రిలీజ్ చేయాలనేది ప్లాన్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతుంది. అయితే ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. నిజానికి ఈ సినిమాను ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత సంక్రాంతికి వెళ్లింది. ఇప్పుడేమో ‘అఖండ’ సెంటిమెంట్ కారణంగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే దసరా కానుకగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. దసరా రోజు సాయంత్రమే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు. బాలయ్య అభిమానులు ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ టీమ్ మాత్రం డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటుంది. దసరా రోజు రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.దీంతో పాటు మరో సినిమా ఒప్పుకున్నారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఆదిపురుష్ టీజర్ పై రాజమౌళి టీసింగ్???

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి మూవీతో యూనివర్సల్ గా ఓ స్టాండర్డ్ ని సెట్ చేశారు. బాహుబలి సిరీస్ లో ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూపించారు. ప్రజంట్ వచ్చిన ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజ్ కావడంతో నెగిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి కూడా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ గురించి, ప్రభాస్ లుక్స్ అండ్ విజువల్ గ్రాఫిక్స్ పై కామెంట్స్ చేశారు. ప్రభాస్ లాంటి తోపు లాంటి హీరోతో ఇలాంటి సినిమా తీయడం ఏంటి అంటున్నారు.

అదే నేనైతే ప్రభాస్ ని రాముడు పాత్రలో అద్భుతంగా చూపించేవాడిని అంటూ రాజమౌళి కామెంట్స్ చేశారు. అసలు ప్రభాస్ లాంటి తోపు లాంటి హీరోని పెట్టుకుని కూడా ఇలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రజంట్ ఈ కామెంట్స్ పరోక్షంగా ఓం రౌత్ పై ఎఫెక్ట్ చూపించనున్నాయట. ఇక రాజమౌళి సోదరుడు సైతం ఆదిపురుష్ మూవీ టీజర్ పై హాట్ కామెంట్స్ చేయగా, దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ ట్వీట్ ఏంటంటే..

పౌరాణికం తీస్తే తెలుగోడు మాత్రమే తీయాలనే ట్వీట్ చేశారు. ఇప్పటివరకు రాజమౌళి తీసిన బాహుబలి లాంటి పౌరాణిక సినిమాకు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు ప్రభాస్ ను రాముడిగా చూపించాలంటే అది రాజమౌళికే సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్ ను వచ్చే ఏడాది జనవరి 12 న థియేటర్స్ లోకి రిలీజ్ చేయనున్నారు. మరి టీజర్ విషయంలోనే ఈ రేంజ్ లో కామెంట్స్ వినిపిస్తే.. నెక్ట్స్ ట్రైలర్ రిలీజ్ అయితే ఈ కామెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనే టాక్ కూడా వినిపిస్తుంది.

పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ పవర్‌ఫుల్ రోల్‌ కోసమే..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపకల్పనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూడో చిత్రమే ‘పుష్ప: ద రైజ్’. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. దీనికి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన రావడంతో పాటు కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ‘పుష్ప’ హిందీలో వంద కోట్ల వసూళ్లను కూడా రాబట్టి సత్తా చాటింది. దీంతో ఈ సినిమా రెండో భాగంపై అందరిలోనూ అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో ‘పుష్ప ద రూల్’ కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలు కాకుండానే ఈ మూవీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫలానా స్టార్ హీరో కీలక పాత్రను పోషిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.పుష్ప ద రూల్’ మూవీలో మరో బాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అతనెవరో కాదు.. హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయిన అర్జున్ కపూర్. అవును.. ఈ బాలీవుడ్ హీరోనే తాజాగా సుకుమార్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో ముంబైకి చెందిన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా డిజైన్ చేశారట. దీనికోసమే అర్జున్ కపూర్‌తో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *