MSD ఇన్నాళ్లకు తన క్రికెట్ దేవుడు ఎవరో చెప్పిన మహేంద్రసింగ్ ధోని.

Spread the love

MSD ఇన్నాళ్లకు తన క్రికెట్ దేవుడు ఎవరో చెప్పిన మహేంద్రసింగ్ ధోని.

మహేంద్ర సింగ్ ధోనీ– ప్రపంచ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆధునిక క్రికెట్‌ను శాసించిన వారిలో ఒకడు..ఎంతోమంది అప్‌ కమింగ్ క్రికెటర్లు ఆరాధ్యుడు. భారత క్రికెట్ జట్టుకు శతృదుర్భేధ్యంగా తీర్చిదిద్దిన కేప్టెన్. ధోనీ హయాంలోనే భారత్‌ రెండోసారి ప్రపంచ కప్ క్రికెట్‌ను ముద్దాడింది.

టీ20 ప్రపంచకప్‌నూ అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగినా- ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటికీ మెరుపులు మెరిపిస్తోన్నారు.తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలబెట్టారు. అలాంటి ధోని- ఓ క్రికెటర్‌గా ఎవర్నీ ఆరాధిస్తారు?, అతని రోల్ మోడల్ ఎవరు, క్రికెటింగ్ ఐడల్ ఎవరనేది తేలింది.

ఆయనే స్వయంగా ఈ ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. బెంగళూరుకు ఆనుకుని ఉండే తమిళనాడు సరిహద్దు పట్టణం హోసూర్‌లో కొత్తగా క్రికెట్ గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్-ధోనీ జాయింట్‌గా దీన్ని ఏర్పాటు చేశారు.దీన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతను తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. క్రికెట్‌లో తాను సచిన్ టెండుల్కర్‌ను ఆరాధిస్తానని ధోనీ తెలిపారు. టెండుల్కర్‌ను చూస్తూ పెరిగానని, ఆయనలా ఆడాలనేదే తన డ్రీమ్ అని చెప్పుకొచ్చారు. తన రోల్ మోడల్, క్రికెటింగ్ ఐడల్.

అన్నీ టెండుల్కరేనని వ్యాఖ్యానించారు. అందరిలాగే తానూ సచిన్ టెండుల్కర్‌కు పెద్ద అభిమానినని చెప్పాడు.గ్రౌండ్‌లో దిగబోయే ముందు- లిటిల్ మాస్టర్‌లా పరుగుల వరద పారించాలని భావిస్తానని, అలా ఆడలేననీ స్పష్టం చేశారు. సచిన్ టెండుల్కర్‌తో కలిసి ధోనీ పలు మ్యాచ్‌లను ఆడాడు. ఇందులో 117 వన్డే ఇంటర్నేషనల్స్, 70 టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి.

ఒక టీ20 ఇంటర్నేషనల్‌లో ఇద్దరూ కలిసి ఆడారు. 2013 నవంబర్‌లో సచిన్ టెండుల్కర్‌ తన కేరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2020 ఆగస్టులో ధోనీ అన్ని ఫార్మట్ల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నాడు. ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.

 

CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *