JR NTR ఫాన్స్ కి షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్.

Spread the love

JR NTR ఫాన్స్ కి షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్… ఇండస్ట్రీలో కొత్త ప్రచారం..

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నేటి తరం హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే, ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్..నూనూగు మీసాలు కూడా రాని వయస్సులోనే ఇండస్ట్రీ లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక ఇండియన్ హీరో ఎన్టీఆర్ ఒక్కడే..అలాంటి ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్ హిట్లు మరియు ఫ్లాపులు కూడా ఉన్నాయి..కానీ హిట్టు ఫ్లాప్ తో శమందం లేకుండా క్రేజ్ ని మైంటైన్ చేసే అతి తక్కువమంది హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్..లేటెస్ట్ గా #RRR సినిమా తో ఆయన క్రేజ్ బౌండరీలు దాటి పాన్ వరల్డ్ స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..

కొమరం భీముడు పాత్రలో ఎన్టీఆర్ కనబర్చిన అద్భుతమైన నటన ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..అంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని మన అందరికి తెలిసిందే.#RRR సినిమా తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తాడు అని అభిమానులు అనుకున్నారు..కానీ ఇప్పటి వరుకు ఆ చిత్రం కనీసం పూజ కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు..ఆరు నెలల నుండి ఈ సినిమా వచ్చే నెల ప్రారంభం అవ్వబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి..కానీ నెలలు అయితే గడుస్తున్నాయి కానీ ఈ చిత్రం గురించి కనీసం ఒక్క వార్త కూడా బయటకి రావడం లేదు..

అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే ఈ సినిమా ఏడాది లో ప్రారంభం అవ్వడం అసాధ్యం అని తెలుస్తుంది..వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..మరో వార్త ఏమిటి అంటే ఎన్టీఆర్ కి సినిమాలు మీద ఆసక్తి తగ్గిందని..ఒప్పుకున్నా ఈ రెండు సినిమాలు పూర్తి చేసి తన మిగిలిన జీవితాన్ని సంపూర్ణంగా రాజకీయాలకు అంకితం చేసే ఆలోచనలో ఉన్నాడని వార్త వినిపిస్తుంది.ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదొక కొత్త ప్రచారం నడుస్తుంది.

కొరటాల శివ తో పాటుగా, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలు మినహా మరో సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం లేదట..ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నాడు అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయట..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ గాని …. ఇప్పుడు ఈ ప్రచారం ఇండస్ట్రీ లో జోరుఅందుకుంటుందట.

యవ్వారం ఏదో తేడా కొడుతుందే ! నీలో ఈ యాంగిల్ కూడా ఉందా?(అనిల్ రావిపూడి).

కరోనాకు ముందు డైరెక్టర్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ రాజమౌళి సురేందర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్టర్స్ మినహా.. డైరెక్షన్ టీమ్ అసిస్టెంట్ అసోసియేట్ అండ్ కో డైరెక్టర్స్ టీమ్ అంతా పాల్గొనగా ఓ ఈవెంట్ జరిగింది.

చిరు ఈవెంట్ కి వస్తున్నాడని తెలియడంతో హాల్ మొత్తం నిండిపోయింది. అంతలోనే మెగాస్టార్ చిరంజీవి హాల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతా సాదరంగా ఆయనని ఆహ్వానించి సీట్ లో కూర్చోబెట్టారు.ఇంతలో డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున ఎవరైనా ఎంటర్ టైనింగ్ గా వుండే ఓ స్కిట్ చేయమన్నాడు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్.. అలా అనడమే ఆలస్యం బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనిల్ రావి పూడి హరీష్ శంకర్ రంగంలోకి దిగేశారు. అయితే ఇందులో మేజర్ పార్ట్ మాత్రం అనిల్ రావిపూడిదే..

మెగాస్టార్ ముందు అనిల్ రావిపూడి ఓ రేంజ్ లో రెచ్చిపోయి స్కిట్ ని రక్తి కట్టించాడు. ఆద్యంతం నవ్వులు పూయించాడు. అనిల్ రావిపూడి టైమింగ్ కి మెగాస్టార్ తో పాటు అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు.ఇంకే ముంది హాలు మొత్తం అనిల్ రావిపూడి స్కిట్ ముగియగానే చప్పట్లతో మారుమోగిపోయింది. అనిల్ లో ఈ స్థాయి ఆర్టిస్ట్ వున్నాడా? అని మెగాస్టార్ కళ్లల్లో కనిపించింది. అదే విషయాన్ని అక్కడున్న వారంతా అనుకుని ఒకింత ఆశ్చర్యపోయారు.ఇప్పుడు అదే విషయాన్ని నిజం చేసే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి అడుగులు వేస్తున్నాడా? అంటే అతను చేస్తున్న టీవీ షోలని బట్టి చూస్తుంటే ఇదే విషయం స్పష్టమవుతోంది.

ఎఫ్ 3′ ప్రమోషన్స్ లోనూ పక్కన వెంకటేష్ వరుణ్ తేజ్ వంటి హీరోలు వున్నా కూడా వారిని డామినేట్ చేస్తూ ప్రచారం చేయడం తెలిసిందే. దీనికి కారణం అతనిలో ఆర్టిస్ట్ కావాలన్న కోరిక బలంగా వుండటమేనని తెలుస్తోంది. తమిళంలో శశికుమార్ లాంటి దర్శకులు హీరోలుగా రాణిస్తున్నట్టే అనిల్ రావిపూడి కూడా అదే పంథాలో షాకివ్వడానికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఆ మధ్య ‘ఆహా’ ఓటీటీ కోసం రంగంలోకి దిగిన ప్రమోషనల్ వీడియోల్లో కనిపించిన అనిల్ రావిపూడి ఇప్పడు ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ షోలో జడ్జిగా దర్శనమివ్వబోతున్నాడు. పేరుకు జడ్జె అయినా ఓ హీరో ఏ స్థాయిలో హంగామా చేస్తాడో ఆ స్థాయి హంగామా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అతని డ్యాన్సులు పంచ్ డైలాగ్ లు చూసి విన్న వారంతా ఖచ్చితంగా అనిల్ హీరోగా షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని కామెంట్ లు చేస్తున్నారు.

ఐరెన్‌లెగ్‌తో మ‌హేష్ రొమాన్స్‌…

మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అలవైకుంఠపురంలో సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి రెండున్నర సంవత్సరాలు దాటేసింది. వచ్చే సంక్రాంతి వస్తే త్రివిక్రమ్ డైరెక్ట్‌ చేసిన సినిమా వచ్చి మూడేళ్లు కంప్లీట్ అవుతుంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమా పట్టాలు ఎక్కలేదు మధ్యలో ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ప‌ట్టాలు ఎక్కాల్సిన‌ సినిమా మ‌ధ్య‌లోనే అగిపోయింది. కారణాలు ఏవైనా ఎన్టీఆర్‌కు- త్రివిక్రమ్ కు ఎక్కడో తేడా రావడంతో ఎన్టీఆర్- కొరటాల శివకు కమిట్ అయిపోయాడు.

ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా తెర‌కెక్కిస్తున్నాడు.అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది.. గత ఆరు నెలల నుంచి అదిగో ఇదిగో అంటూ వస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు. మహేష్ సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యి కూడా నెలలు గడిచిపోతున్న ఇంకా త్రివిక్రమ్ సినిమాపై ఎలాంటి అప్డేట్లు లేవు. రీసెంట్‌గా మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతి చెందడంతో కాస్త గ్యాప్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లి వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ కి జోడిగా మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.

గతంలో మహేష్ – పూజా కాంబినేషన్లో వచ్చిన మహర్షి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అత్తారింటికి దారేది సినిమాలో సమంత- ప్రణీత, అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్- అను ఇమ్మానుయేల్, జల్సాలో ఇలియానా -పార్వతి మెల్టన్, అ..ఆ సినిమాలో సమంత- అనుపమ పరమేశ్వరన్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత- ఆదాశర్మ- నిత్య మీనన్ నటించారు.ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ మహేష్ బాబు సినిమాలో సైతం ఇద్ద‌రు హీరోయిన్ల‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకున్నారట.

ఆమె తాజాగా విజయ్ దేవరకొండ డిజాస్టర్ లైగ‌ర్ లో హీరోయిన్ గా నటించింది.లైగర్ సినిమాలో అనన్య నటన చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆమెకు ఏమాత్రం నటన సరిగా రాదని కూడా విమర్శలు చేశారు.ఇప్పుడు ఆ ఐరన్ లెగ్ బ్యూటీని మహేష్ బాబుకి జోడిగా ఎంపిక‌ చేయడంతో మహేష్ అభిమానులు కూడా త్రివిక్రమ్ కు దండాలు పెట్టేస్తున్నారు. నీకు అనన్య తప్ప మ‌రే హీరోయిన్ కనిపించలేదా.. శ్రీలీల‌ను పెట్టుకోవచ్చు కదా అని మహేష్ బాబు అభిమానులు సలహాలు ఇస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *