Mahesh Babu: మహేశ్ బాబు సినిమాలో హాలీవుడ్ హీరో

Spread the love

MaheshBabu: మహేశ్ బాబు సినిమాలో హాలీవుడ్ హీరో

మహేశ్ బాబు సినిమాలో హాలీవుడ్ హీరో‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్.రాజమౌళి . జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది.

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 20నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి వెస్ట్రన్ ఆడియన్స్ ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు అనేక మంది రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు. ఇండియాతో పాటు విదేశాల్లోని ప్రేక్షకులు జక్కన్న నుంచి రాబోయే తర్వాతి ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

అయితే, రాజమౌళి టాలీవుడ్ హీరో మహేశ్ బాబు తో మూవీ చేయనున్నట్టు గతంలోనే చెప్పాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి నేపథ్యంలో కథ రాస్తున్నట్టు వెల్లడించాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తుంది.

ఈ సినిమాలో ఓ హాలీవుడ్ హీరో నటించనున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వ‌ర్త్ (Chris Hemsworth) మహేశ్ బాబు సినిమాలో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మేకర్స్ క్రిస్‌తో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. కానీ, అతడు మాత్రం తన అంగీకారాన్ని తెలియజేయలేదట. క్రిస్‌తో పాటు మరికొంత మంది హాలీవుడ్ నటులు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించనున్నారట.

హాలీవుడ్ టాలెంట్ కంపెనీ ‘క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ’ తో జక్కన్న ఒప్పందం కుదుర్చుకోవడం ఈ వదంతులకు మరింత బలం చేకూరుస్తుంది. కానీ, హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ నటిస్తున్నట్టు చిత్ర బృందం ఇంత వరకు ప్రకటించలేదు. క్రిస్ మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్‌లో థోర్ (Thor) పాత్రలో కనిపించాడు. ఈ రోల్‌తోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నాడు.

 

ఎన్టీఆర్ 30 విషయంలో కొనసాగుతున్న సస్పెన్సు..

 

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తన లాస్ట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తర్వాత నార్త్ సహా ఓవర్సీస్ ఆడియెన్స్ లో కూడా మంచి ఫేమ్ అందుకున్న తారక్ తన నెక్స్ట్ సినిమా ఎంత త్వరగా చేసి రిలీజ్ చేస్తాడా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ దర్శకుడు కొరటాల శివ తో ఎన్టీఆర్ తన కెరీర్ లో 30వ సినిమాని ఓకే చేసాడు.దీని నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ టీజర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈపాటికే స్టార్ట్ కావాల్సి ఉన్న ఈ చిత్రం పై మాత్రం ఇప్పటికీ అదే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కన్ఫర్మ్ కాలేదు. దీనితో ఫ్యాన్స్ కూడా క్లూ లెస్ గా ఉన్నారు.

మొన్నటి వరకు దసరా కి సినిమా నుండి అప్డేట్ వస్తుంది.కచ్చితం గా ఒక సాలిడ్ అప్డేట్ దసరా కానుకగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం రాబోతుంది అంటూ రక రకాలుగా ప్రచారం జరిగింది.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 వ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా దసరా కి రాబోవడం లేదు అని.

ఎన్టీఆర్ 30 సినిమా దర్శకుడు మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పుకార్లు, షికార్లు చేస్తున్నాయి.ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కొరటాల శివ కి మరో సారి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ ఈసారి కూడా స్క్రిప్ట్ విషయం లో సంతృప్తి పరచక పోతే బుచ్చి బాబు కి వెంటనే డేట్లు ఇచ్చే అవకాశం ఉందంటూ నందమూరి కాంపౌండ్ నుండి గుస గుసలు వినిపిస్తున్నాయి.అది ఈ ఏడాది చివరి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది లో ఎన్టీఆర్ 30 సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

 

వీరమల్లు పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన కీరవాణి.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన కెరీర్ లోనే మంచ్చి మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ చిత్రంలో పవన్ మొదటిసారి ఒక వారియర్ లుక్ లో కనిపించనున్నారు.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఆల్రెడీ మంచి అంచనాలు కూడా నెలకొనగా పవన్ ఈ సినిమా షూటింగ్ విషయంలో మళ్ళీ దృష్టి సారించినట్టుగా ఇప్పుడు క్లియర్ అప్డేట్ వచ్చింది.

ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారిపోయింది.హరిహర వీరమల్లు చిత్రం వర్క్ షాప్స్ ఇప్పుడు స్టార్ట్ చేశామని నవ రాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ స్టైలిష్ లుక్ లో పవన్ ఫోటో షేర్ చేసి తెలియజేసారు. దీనితో ఈ స్వీట్ షాకింగ్ పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారిపోయింది. ఇక సినిమా షూటింగ్ అయితే ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందో చూడాలి.

ఒకే స్టేజీపై మెగాస్టార్ అండ్ కింగ్ నాగార్జున..

ప్రస్తుతం మన టాలీవుడ్ దిగ్గజ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే కింగ్ నాగార్జున లు హీరోలుగా నటించినటువంటి తమ లేటెస్ట్ చిత్రాలు “గాడ్ ఫాథర్” మరియు “ది ఘోస్ట్” ల కోసం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఈ దసరా కానుకగా ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి.

మరి బయట ఆడియెన్స్ కి ఇది పెద్ద ఫైట్ కావచ్చు కానీ చిరు మరియు నాగ్ లు అయితే తమ సినిమాల్లో ఒకొక్కరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొని తమ ఫ్రెండ్షిప్ ని అయితే వ్యక్త పరిచారు.

ఇలా తమ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తాము ఇప్పుడు ఒకే స్టేజి పై అయితే కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో జరిగే పరివార్ అవార్డ్స్ కోసం గాను ఈ ఇద్దరు స్టార్స్ రాబోతున్నారట.

దీనితో అయితే గాడ్ ఫాథర్ మరియు ది ఘోస్ట్ నాగ్ లు ఒకే స్టేజ్ పై కనిపించి వారి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తారని చెప్పాలి. ఇక ఈ చిత్రాలు అయితే ఈ అక్టోబర్ 5న తెలుగు సహా హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *