RRR: RRR టీం దానికోసమే జపాన్ వెళ్లనుందా?

Spread the love

RRR: RRR టీం దానికోసమే జపాన్ వెళ్లనుందా?

 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ సంపాందించింది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21 న జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాజమౌళి వెల్లడించారు. మూవీ ప‍్రమోషన్స్‌లో భాగంగా ఆయనతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం జపాన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా జపనీస్ ప్రజలను ఆర్ఆర్ఆర్ అలరించబోతోంది. మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది.

వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టగా.. బాలీవుడ్‌లో కూడా రూ. 300 కోట్లను వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్‌ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ. 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది.

అయోధ్యలో ‘అర్జునుడు’

దర్శకుడు త్రివిక్రమ్ మూవీ టైటిల్స్ లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇక కొన్నాళ్లుగా ఆయన ‘అ’ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. టైటిల్ మొదటి అక్షరం ‘అ’ తో మొదలయ్యేలా టైటిల్ సెట్ చేస్తున్నాడు.

అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో ఈ కోవకు చెందిన టైటిల్స్ అని చెప్పొచ్చు. మహేష్ కోసం ఆయన ఇదే తరహా టైటిల్ సెట్ చేశాడట. మాస్ అప్పీల్ తో పాటు క్యాచీగా ఉండేలా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ నిర్ణయించాడట.

మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే అంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయోధ్యలో అర్జునుడు టైటిల్ పట్ల మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. టైటిల్ అద్బుతంగా ఉంది, ఇక బాక్సాఫీస్ బద్దలే అంటున్నారు. మరి ప్రచారమవుతున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.

కానీ టాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది.

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి . అందులోనూ దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్ వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ ఓ ఉన్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి పని చేస్తున్నారు.

గతంలో మహేష్ హీరోగా త్రివిక్రమ్ అతడు, ఖలేజా చిత్రాలు తెరకెక్కించారు. అతడు ఆల్ టైం తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ మూవీగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా మహేష్ 28వ చిత్రం విడుదల కానుంది. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో రాజమౌళి మూవీ షూటింగ్ మొదలుకానుంది.

పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చిన…మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాను రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు మెగాస్టార్.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రమోషన్స్ కంటే ముందే ఓ డైలాగ్‌ ఆడియోను ట్వీట్ చేసి.. తెలుగు టూ స్టేట్స్ లో పొలిటికల్ రచ్చ లేపిన మెగాస్టార్ చిరు.. ఇప్పుడా రచ్చ రేంజ్‌నే మార్చేశారు.

అనంతపూర్‌లో జరిగిన గాడ్‌ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా… మరో పవర్‌ ఫుల్ డైలాగ్ చెప్పి.. అందర్నీ షాక్ చేశారు చిరు. షాక్ చేయడమే కాదు.. ఈ సారి పొలిటికల్ వార్నింగ్ ఇచ్చారనే మాటను మూటగట్టుకుంటున్నారు. మెగాస్టార్ మాట్లాడుతూ..తాను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుందన్నారు.

https://youtu.be/Bv48ktLduIc

 

ఈ వేడుక సమయంలో వర్షం రావడం ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నానని అన్నారు చిరు. రామ్ చరణ్ వల్లే తాను ఈ సినిమా చేశానని.. అతని కోరిపైనే ఈ సినిమా చేశానని తెలిపారు.

చిరంజీవి మాట్లాడుతున్నంత సేపు అభిమానులు వర్షంలో తడుస్తూ.. ఈలలు, కేకలతో హోరెత్తించారు. మెగాస్టార్.. మెగాస్టార్ అంటూ నినదాలు చేశారు.
ఇక అంత వర్షంలోనూ.. కదలని అభిమాలను ఉద్దేశ్యించి మెగా స్టార్ ఉద్వేగంగా మాట్లాడారు.

తాను ఎప్పుడు వచ్చినా.. రాయసీమలో వర్షం పడుతుందని… ఇదో సెంటిమెంట్‌ అని చెబుతూనే.. ఓ పవర్‌ ఫుల్ డైలాగ్ ను జనాలపైకి సంధించారు. మీ అందరి ఊపిరిని కాంట్రాక్ట్ తీసుకున్నా అంటూ.. ఒక్కాసారిగా తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ న అరిపించారు.

అయితే చిరు చెప్పిన కాంట్రోవర్సీ డైలాగ్ చివరి లైన్ ఇదే అయినా.. అది బానే ఉన్నా..! దాని ముందు ఉన్న మాటలే ఇప్పుడు పొలికల్ గా హీట్ పెంచేస్తున్నాయి. ‘నీళ్ల కాంట్రాక్ట్‌, కొండ కాంట్రాక్ట్‌, మద్యం కాంట్రాక్ట్‌, నేల కాంట్రాక్ట్‌ లంటూ ..

ఒక్కొక్కరూ ప్రజల సొమ్మును తిని బలిసికొట్టుకుంటున్నారు. ఈ రోజు మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను.. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం.. తప్పు చేయాలంటే భయం.. తప్ప మీ మనసులో ఏది ఉండకూడదు. ఏదైనా జరగకూడదని జరిగిందో.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబడ్దార్’ అని చిరు చెప్పిన డైలాగ్.. చిరు వార్నింగ్ అంటూ.. సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్ .

 

అయోధ్యలో ‘ఆదిపురుష్’..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

వారి నిరీక్షణకు తెరదించుతూ ఆదిపురుష్ టీజర్ పోస్టర్ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు.అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా అయోధ్యకు బయలుదేరుతున్నారు. తమ అభిమాన హీరోను, ఆయన సినిమా టీజర్ ను చూసేందుకు అయోధ్యకు పయనం అవుతున్నారు. ఇక చాలా కాలంగా ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ మధ్య వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెటెషన్స్ ను రీచ్ కాలేకపోయింది. పిరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన రాధేశ్యామ్ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు డార్లింగ్. ఇక ఇప్పుడు రాముడుగా ఆకట్టుకోనున్నాడు.

ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓం రావత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెర పైకి రానుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *